పంచకర్ల రమేష్‌బాబు జనసేనలో చేరతారంటూ ప్రచారం
Panchakarla Ramesh Babu: రమేష్‌బాబు ఆరోపణల్లో వాస్తవంలేదన్న ఎస్వీసుబ్బారెడ్డి
పంచకర్ల రమేష్‌బాబు జనసేనలో చేరతారంటూ ప్రచారం
Panchakarla Ramesh Babu: విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరనున్నట్టు తెలుస్తోంది. అయితే విశాఖ వచ్చిన టీటీడీ ఛైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి దీనిపై స్పందించారు. రమేష్ బాబు ఈ నిర్ణయం తీసుకునే ముందు పార్టీ నాయకులతో చర్చించి ఉంటే బాగుండేదన్నారు. ప్రజా సమస్యలపట్ల స్పందించడంలేదని రమేష్ బాబు చెప్పడం వాస్తవం కాదన్నారు. వైసీపీ వ్యవస్థాపక దినం నుంచి ఉన్న వారిని కూడా పక్కన పెట్టి రమేష్ బాబుకు పార్టీలో ప్రాధాన్యతనిచ్చామని ఆయన అన్నారు.