ఇంటింటికి తిరిగి కూరగాయలు పంచిన టీడీపీ ఎమ్మెల్యే

కరోనా వైరస్ ... చైనాలో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు 195 దేశాలకి పైగా వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకి గురి చేస్తోంది.

Update: 2020-03-29 07:20 GMT
TDP MLA Nimmala Ramanaidu

కరోనా వైరస్ ... చైనాలో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు 195 దేశాలకి పైగా వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకి గురి చేస్తోంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తునట్లు కేంద్ర ప్రభుత్వం సంచనల నిర్ణయం తీసుకుంది. ఇక ప్రజలు కూడా బయటకు రాకుండా సహకరించాలని కోరుతున్నాయి. అయితే నిత్యావసర వస్తువులు, మెడికల్ షాపులను తెరిచి ఉంటాయని, అయితే ప్రజలు బయటకు గుంపులుగుంపులుగా కాకుండా ఒక్కోకరిగా రావాలని, సామాజిక దూరం పాటించాలని వెల్లడించింది.

ఇక ప్రజలకి కరోనా పైన మరింత అవగాహన కల్పించేందుకు పలు చోట్ల రాజకీయ నేతలు స్వయంగా బయటకు వెళ్లి కరోనా వ్యాపించకుండా సామాజిక దూరం పాటించాలని చేబుతున్నారు. అందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌కు సహకరించాలని, బయటకు రావొద్దని కోరుతున్నారు. ఇక నిత్యావసరాలు, కూరగాయలను ప్రభుత్వం నేరుగా ఇంటికి తీసుకెళ్లి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇలా చేయడం వలన జనాలు ఎవరు బయటకు రారని, ఇలా కరోనా వైరస్ ని అరికట్టవచ్చునని అయన వెల్లడించారు. మరోవైపు అన్ని పట్టణాల్లో సరుకులు ఇళ్లకు హోం డెలివరీ సౌకర్యం ఉందని ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.

ఇక కరోనా వైరస్ రోజురోజుకి విలయ తాండవం ఆడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఇక భారత్ లో కూడా క్రమక్రమంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 900 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20 మంది మృతి చెందారు. ఇక ఏపీలో 13 కరోనా కేసులు నమోదు అయినట్టుగా రాష్ట్ర ఆరోగ్య శాఖా వెల్లడించింది.  

Tags:    

Similar News