Lockdown In Ongole : లాక్‌డౌన్‌ దిశగా ఒంగోలు .. యంత్రాంగం చర్యలు

Lockdown In Ongole : ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. దీనితో కరోనా కట్టడికి అధికారులు చర్యలు మొదలు పెట్టారు.

Update: 2020-08-08 06:10 GMT
Lockdown

Lockdown In Ongole : ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. దీనితో కరోనా కట్టడికి అధికారులు చర్యలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఒంగోలులో మరోమారు లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు యంత్రాంగం సిద్దమైంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ సారి కఠిన నిర్ణయాలు అమలు చేయాలని, కేవలం లాక్ డౌన్ వల్లనే కరోనాని అరికట్టవచ్చునని అధికారులు భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో లాక్‌డౌన్‌కు సంబంధించి స్పష్ట్టమైన ఉత్తర్వులు వెలువడనున్నాయి.

కరోనా విషయంలో ఒంగోలు నగరవాసులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. కరోనా నిబంధనలును ఏ మాత్రం పాటించకుండా, వీధుల్లో గుంపులు గుంపులుగానే తిరుగుతున్నారు. టీ దుకాణాల వద్ద ఎలాంటి మాస్క్‌లు పెట్టుకోకుండా మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. ఇక శానిటైజర్‌ వంటి వాటిని వినియోగిస్తున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కరోనా బారిన పడ్డారంటే దాని తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు

ఇక లాక్ డౌన్ సమయంలో నిత్యావసరల కోసం ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకే అనుమతి ఇవ్వనున్నారు. అత్యవసరమైన మందుల దుకాణాలు, పెట్రోలు షాపులు తెరుస్తారు. ఎవరైనా నిబంధనలు పాటించకుండా బయటకు వస్తే చర్యలు తప్పవని అధికారులు అంటున్నారు.

ఇక అటు ఏపీలో కరోనా విషయాని వస్తే.. గడిచిన 24 గంటల్లో 62,938 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 10,171 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,06,960 కు చేరింది. కొత్తగా 7,594 మంది వైరస్ నుంచి కోలుకోగా... మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,20,464కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 89 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. 

Tags:    

Similar News