జులై 8,9 తేదీలలో వైసీపీ ప్లీనరీ...నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం

YCP Plenary Meeting: నాగార్జున యూనివర్శిటీ దగ్గర ప్లీనరీకి ఏర్పాట్లు

Update: 2022-06-02 02:08 GMT

జులై 8,9 తేదీలలో వైసీపీ ప్లీనరీ...నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం

YCP Plenary Meeting: 2024లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ ఇప్పటి నుంచే సిద్ధం అవుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ నిర్వాణకు కసరత్తు చేస్తున్నారు. గుంటూరు-విజయవాడ నగరాల మధ్యలో నాగార్జున యూనివర్శిటీ సమీపంలో ప్లీనరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు, జిల్లా అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ వేదికగా సీఎం జగన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

ప్లీనరీకి సంబంధించి పార్టీ నేతలు, కార్యకర్తలు, అతిధులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్లీనరీ నిర్వాహణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. జూలౌ 8వ తేదీన ప్రారంభమై తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు ప్లీనరీ కొనసాగుతుందని... ఇందుకు పార్టీ నేతలంతా సమాయత్తం కావాలని ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న దృష్టా ప్రజల్లోకి పార్టీనీ ఏవిధంగా వెళ్ళాలన్నదానిపైనా వైసీపీ అధిష్టానం ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. పార్టీ నేతలంతా ఎక్కడైనా చిన్నపాటి విభేదాలున్నప్పటికీ పక్కన పెట్టి ఐకమత్యంగా ముందుకు వెళ్ళాలని విజయసాయిరెడ్డి సూచిస్తున్నారు. 

పార్టీ గ్రామ,మండల,జిల్లా,రాష్ర్ట కమిటీలకు సంబంధించి పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పార్టీకి లాయల్ గా అంకితభావంతో పనిచేసే వారికి స్ధానం కల్పించడం జరుగుతుందన్నారు విజయసాయిరెడ్డి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ పాటించడంతోపాటు ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటీలకు తగిన విధంగా ప్రాతినిధ్యం ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పార్టీ ఎంఎల్ఏలు, నియోజక వర్గ ఇన్ ఛార్జిలు స్ధానికంగా పార్టీ పటిష్టత కోసం పాటుపడేవారిని సూచించాలనేది సీఎం జగన్ ఆకాంక్ష అని వివరించారు.

జిల్లా అధ్యక్షులు పార్టీ కమిటీలకు సంబంధించి పార్టీ ఎంఎల్ ఏలు,సమన్వయకర్తలను సమావేశపరిచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారుచేసుకోవాలన్నారు. పార్టీ ప్లీనరీలో నూతన కమిటీల నియామక ప్రకటన జరుగుతుందని వివరించారు. బూత్ కమిటీలకి సంబంధించి కూడా సచివాలయాల సందర్శన కార్యక్రమం అనంతరం పేర్లను పంపాలని సూచించారు. పార్టీ ప్రారంభించి ప‌దేళ్లు పూర్తి కావ‌డం, సీఎంగా జ‌గ‌న్ మూడేళ్ల ప‌ద‌వీ కాలాన్ని పూర్తి చేసుకోవ‌డం వంటి కీల‌క ప‌రిణామాల నేప‌థ్యంలో పార్టీ ప్లీన‌రీని ఘ‌నంగా నిర్వహించాలని వైసీపీ అధిష్టాం క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టింది.

Tags:    

Similar News