Andhra Pradesh: విశాఖ సముద్రంలోకి ఆలివ్ రెడ్లీ తాబేళ్లు

Andhra Pradesh: తాబేలు పిల్లలను సముద్రంలో వదిలిన అటవీ అధికారులు * పర్యావరణ కాలుష్యంతో అంతరిస్తోన్న ఆలివ్ రెడ్లీ తాబేళ్లు

Update: 2021-03-25 06:07 GMT

ఆలివ్ రిడ్లీ  తాబేలు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: అరుదైన ఆలివ్ రెడ్లీ తాబేళ్లను సముద్రంలోకి వదిలారు అటవీ, పర్యావరణ శాఖ అధికారులు. తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా తాబేళ్ల గుడ్లను సంరక్షిస్తోన్న అధికారులు నిన్న తాబేలు పిల్లలను విశాఖ తీరంలో సముద్రంలోకి వదిలారు. కాలుష్యంతో ఆలివ్ రెడ్లీ తాబేళ్లు అంతరిస్తుండటంతో ప్రత్యేకంగా వీటిని సంరక్షిస్తున్నారు అటవీశాఖ అధికారులు. సముద్ర జలాలను శుద్ధి చేసే ఈ రకం తాబేళ్ల గుడ్లను ఏటా జనవరిలో తీసుకొచ్చి అరుదైన జాతిని కాపాడుతున్నారు. ఇక సముద్రంలోకి బుడి బుడి అడుగులతో వెళ్తోన్న తాబేళ్లను చూసి పిల్లలు, ప్రకృతి ప్రేమికులు పరవశించిపోయారు.

Tags:    

Similar News