ప్రాణం తీసిన ఉల్లి ధర..

Update: 2019-12-09 06:47 GMT
ప్రతీకాత్మక చిత్రం

తీవ్రంగా కురిసిన వర్షాల వలన ఉల్లి దిగుబడి తగ్గడంతో నెల రోజులుగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండా రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధరలపై ఉల్లిని పంపిణీ చేస్తున్నారు. ఇదే కోణంలో ఒక వృద్ధుడు సబ్సీడీ ఉల్లి కోసం క్యూ లైన్లో నిలుచుని తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఈ విశాదకరమైన సంఘటన గుడివాడలో చోటు చేసుకుంది.

కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజార్‌లో సాంబయ్య (65) అనే వృద్ధుడు సబ్సీడీ ఉల్లి కోసం ఉదయం నుంచి క్యూలైన్లో నిలుచున్నాడు. కేజీ ఉల్లి 25 రూపాయలకు అందించడంతో చాలా మంది క్యూలైన్ లో బారులు తీరారు. అప్పటికే చాలా సమయం గడిచిపోవడంతో లైన్లో నిలుచున్న వృద్ధుడు ఒక్కసారిగా కల్లు తిరిగి కింద పడిపోయాడు. అది గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు అప్పటికే అతను గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.



Tags:    

Similar News