దిశ నిందితుల ఎన్ కౌంటర్..రోజంతా ఉచితంగా టీ

గత పదిరోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు కొలిక్కి వచ్చంది.

Update: 2019-12-07 09:23 GMT
సత్యనారాయణమూర్తి

గత పదిరోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు కొలిక్కి వచ్చంది. దిశని అతి కిరాతకంగా చంపేసిన దుండగులకు ఉరిశిక్షవిధించాలని ప్రజలందరూ ధర్నాలు నిర్వహిస్తూ ర్యాలీలు చేసారు. ఇదే సమయంలో పోలీసులు ఆ నలుగురిని రీ కన్ స్ట్రక్షన్ కోపం సంఘటనా స్థలానికి తీసుకెళ్ళగా వాళ్లు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేసారు. దీంతో పోలీసులు నిందుతులను ఎన్ కౌంటర్ చేసి హతమార్చారు.

ఈ నేపథ‌్యంలోనే దేశవ్యాప్తంగా అందరూ సంబరాలు జరుకున్నారు. దిశ ఆత్మకు శాంతి కలిగిందంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు తెలంగాణ పోలీసులను మెచ్చుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో సంతోషాన్ని పంచుకుంటే విజయవాడకు చెందిన ఓ టీస్టాల్ యజమాని మాత్రం విభిన్నంగా తన సంతోషాన్ని ప్రజలతో పంచుకున్నాడు.

పూర్తి వివరాల్లోకెళితే విజయవాడలోని ప్రభుత్వాసుపత్రి వద్ద సత్యనారాయణమూర్తి అనే ఆరుపదుల వయస్సున్న వ్యక్తి టీ స్టాల్ నడుపుకుంటూ తన జీవనం సాగిస్తున్నాడు. అతనికి ముగ్గురు కూతుర్లున్నారు. కాగా తన కూతురు లాంటి దిశను నలుగురు కిరాతకంగా చంపడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయాడు. నిన్న తెల్లవారు జామున దిశ హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసారని తెలియడంతో తన టీ స్టాల్ కు వచ్చిన వారందరికీ ఉచితంగా టీ, కాఫీ, పాలు పంపిణీ చేసాడు. ఆ రోజంతా ఎంత మంది వచ్చి టీ కావాలన్నా సంతోషంతో టీ పంచిపెడుతున్నాడు.   


 

Tags:    

Similar News