Andhra Pradesh : నేటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

ఏపీలో ఇవాళ్టి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది.

Update: 2020-03-09 01:57 GMT
AP MPP, ZPTC

 ఏపీలో ఇవాళ్టి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ( మార్చి 11వ తేదీ) వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అయితే , 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉప సంహరణకు ముహూర్తం ఖరారు చేశారు. మొత్తం 660 జడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈ నెల 21 జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ జరగనుంది. 24న కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఈ నెల 30న జడ్పీఛైర్లమ్మన్ల ఎన్నికల ఉంటుంది. అదే రోజు ఛైర్మన్ , కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉంటుంది. జడ్పీ ఛైర్మన్ల ఎన్నిక ఈ నెల 30న పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారు.

ఇవాళ నోటిఫికేషన్ మున్సిపాల్టీ, కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్నికల సంఘం రిలీజ్ చేయబోతోంది. ఒకేసారి 12 కార్పొరేషన్లు, 74 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉంటుంది. నామినేషన్ల పరిశీలన 14న తేదీన ఉంటుంది. నామినేషన్లను ఉపసంహరణ 16న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. 23న పోలింగ్ ఉంటుంది. 27న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతోంది. ఈ నెల 31న 12 కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారు. అలాగే మున్సిపాలిటీలకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎన్నిలు ఉంటాయి. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక జడ్పీటీసీ ఎన్నికలకు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్, ఎంపీటీసీకి తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ ఉపయోగించనున్నారు.
  

Tags:    

Similar News