Nimmagadda Ramesh Kumar to Take Charge: ఈ రోజు భాద్యతలు చేపట్టనున్న నిమ్మగడ్డ

Update: 2020-08-03 02:39 GMT

Nimmagadda Ramesh Kumar to take charge: ఎట్టకేలకు నిమ్మగడ్డ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. గవర్నర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వడంతో నేడు భాద్యతలు చేపట్టేందుకు నిమ్మగడ్డ రమేష్ సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా నేటి నుంచి మరలా విధులు నిర్వర్తించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11.15 గంటలకు ఆయన బాధ్యతలు చేపడతారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను పునర్నియమిస్తూ ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తున్నట్టు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎన్నికల కమిషనర్‌గా రమేశ్ కుమార్ నియామకానికి సంబంధించి గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. నాటకీయ పరిణామాల నడుమ ఎస్ఈసీ కమిషనర్ గా తొలగించబడ్డ రమేష్ కుమార్ కోర్టు ఆదేశాల మేరకు తిరిగి బాధ్యతలు చేపడుతున్నారు. నిమ్మగడ్డ పదవీ కాలం కుదింపు, కొత్త కమిషనర్‌గా జస్టిస్ కనగరాజును నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. తిరిగి రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ సుప్రీం కోర్టు తిరస్కరించింది.

మరోవైపు హైకోర్టు తీర్పును అమలుచేయట్లేదంటూ నిమ్మగడ్డ కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే దీనిపై స్టే ఇవ్వాలంటూ జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించగా మరోసారి చుక్కెదురైంది. స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ఏపీ హైకోర్టులో జరగబోయే పరిణామాలపై తదుపరి అఫిడవిట్ దాఖలు చేస్తామని నిమ్మగడ్డ తరఫు లాయర్ కోరగా, అందుకు సుప్రీంకోర్టు వారం రోజులు గడువిచ్చింది. ఇంతలోనే ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీగా రమేష్‌ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో ఎనిమిది నెలల్లో తన పదవి నుంచి దిగిపోతున్నారు. కరోనా సమయంలో ఇప్పుడు ఎన్నికలు జరిపే పరిస్థితి లేదు. ఏపీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఎన్నికలు మరో ఆరునెలలు వరకూ జరిగే అవకాశం లేదు. స్థానిక సంస్థల ఎన్నిలకు జరిపించాలన్నా రాష్ట్ర ఎన్నికల అధికారికి ప్రభుత్వ సహకారం అవసరం. ఈ విధమైన పరిస్థితుల్లో ఎన్నికల అధికారిగా భాద్యతలు చేపట్టనున్న రమేష్ కుమార్ కు ఏ మేరకు ప్రభుత్వం సహకరిస్తుందో్ వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News