Night Curfew: గుంటూరు సిటీలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ
Night Curfew: గుంటూరు సిటీలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడు ప్రకటించారు.
Night Curfew: గుంటూరు సిటీలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ
Night Curfew: గుంటూరు సిటీలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడు ప్రకటించారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకే దుకాణాలను తెరిచి ఉంచాలని ఆదేశించారు. ఆరు తర్వాత షాపులు తీసి ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. గుంటూర్ సిటీలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. కేసులను కంట్రోల్ చేసేందుకే లాక్‌డౌన్ ఆంక్షాలు విధిస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. మెడికల్, అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని మేయర్ వివరించారు. గుంటూరు ప్రజలు సహకరించాలని మేయర్ విజ్ఞప్తి చేశారు.