Amaravati: అమరావతిలో ఎన్‌ఐఏ సోదాలు

Amaravati: తాడేపల్లి, డోలాస్ నగర్, మంగళగిరి, నవులూరులో ఎన్‌ఐఏ తనిఖీలు

Update: 2023-10-02 07:33 GMT

Amaravati: అమరావతిలో ఎన్‌ఐఏ సోదాలు

Amaravati: అమరావతిలో NIA సోదాలు జరిగాయి. తాడేపల్లి, డోలాస్ నగర్, మంగళగిరి, నవులూరు ప్రాంతాల్లో NIA అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలో మావోయిస్టు దాని అనుబంధ సంస్థల కదలికలపై నిఘా పెట్టిన NIA.. పలువురికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ప్రగతిశీల సమాఖ్య సభ్యుల ఇళ్లల్లో సోదాలు చేశారు. సంస్థ కోశాధికారి బత్తుల రమణయ్య ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులు.. పలు కీలక పత్రాలు, ఆధార్‌, రేషన్‌కార్డు, మొబైల్‌ ఫోన్లు, సిమ్‌ కార్డులతో పాటు బ్యాంకు అకౌంట్‌ బుక్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 11న హైదరాబాద్‌లోని NIA ఆఫీస్‌కు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే.. ప్రగతిశీల సమాఖ్యలో తాను కోశాధికారిగా ఉన్నానని, కానీ.. యాక్టివ్‌గా సంస్థకు సేవ చేయడంలేదని NIA అధికారులకు బత్తుల రమణయ్య వివరించారు.

Tags:    

Similar News