ఆ డైరీ ఆధారంగానే అరెస్ట్.. మావోయిస్టు నేత ఆర్కే భార్య శిరీష అరెస్ట్‌పై NIA ప్రకటన..
National Investigation Agency: మావోయిస్టు నేత ఆర్కే భార్య శిరీష అరెస్ట్‌పై ఎన్‌ఐఏ ప్రకటన విడదల చేసింది.
ఆ డైరీ ఆధారంగానే అరెస్ట్.. మావోయిస్టు నేత ఆర్కే భార్య శిరీష అరెస్ట్‌పై NIA ప్రకటన..
National Investigation Agency: మావోయిస్టు నేత ఆర్కే భార్య శిరీష అరెస్ట్‌పై ఎన్‌ఐఏ ప్రకటన విడదల చేసింది. ఆర్కే డైరీ ఆధారంగా శిరీషను అరెస్ట్ చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. శిరీషతో పాటు దుడ్డు ప్రభాకర్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మావోయిస్టుల కోసం దుడ్డు ప్రభాకర్, శిరీష పని చేస్తున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. మావోయిస్టుల నుంచి వీరు పెద్ద ఎత్తున నిధులను తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2019 తిరియా ఎన్‌కౌంటర్‌లో ఈ ఇద్దరు పాల్గొన్నారని చెప్పారు. మావోయిస్టుల కోసం రిక్రూట్‌మెంట్ కూడా చేస్తున్నారని, వారోత్సవాల సందర్భంగా భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేశారని ఎన్‌ఐఏ అధికారులు వివరించారు.