NGT Warning to AP: ఏపీ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం
NGT: ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామని హెచ్చరిక
Rayalseema Lift Irrigation Scheme (photo: thehansindia)
NGT Warning to AP: ఏపీ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామని హెచ్చరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ పనులు చేస్తున్నారని తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది ఎన్జీటీ.