గజపతుల కోల్డ్‌వార్‌లో ఇది మరో ట్విస్టా?

Update: 2020-10-31 07:10 GMT

మొన్నటి వరకు బాబాయ్‌, చెల్లెలు సంచైతపై యుద్ధం ప్రకటించారన్న చర్చ జరిగింది. ఊర్మిళా గజపతి వెనక, అశోక్‌ గజపతి వున్నారన్న మాటలూ వినపడ్డాయి. అయితే, సిరిమానోత్సవం వివాదంలో, అసలు ట్విస్ట్‌ చెప్పారు చిన్న చెల్లెలు ఊర్మిళ. మాన్సాస్‌ వార్‌లో ద్విముఖ పోరు, త్రిముఖ పోరుగా మారిందా?

విజయనగరం సామ్రాజ్యంలో రాజులతో పాటు సరిసమానంగా ఆస్తుల కోసం రాణిలు పోటి పడుతున్నారా నిన్నటి వరకు అక్కా చెల్లిల్ల మద్య లేక బాబాయ్ అమ్మాయిల మద్య కోనసాగిన యుద్దం నేడు మరో కోత్త మలుపు తిరిగిందా రోజుకో కోత్త మలుపు తిరుగుతున్న రాజకోట రహస్యంలో విజయం సాదించేదేవరు. విజయనగరం రాజకుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై హెచ్ఎంటివి అందిస్తోన్న ప్రత్యేక కధనం.

విజయనగర గజపతుల సమరం రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట అశోక్‌ గజపతి వర్సెస్ సంచైతగా యుద్ధం సాగింది. మధ్యలో ఊర్మిళా గజపతి కూడా ఎంటర్‌ కావడంతో ఇంకో టర్న్ తీసుకుంది. ఊర్మిళ కూడా సంచైతనే విమర్శించడంతో, బాబాయ్‌ అశోకే, సంచైతకు వ్యతిరేకంగా ఊర్మిళను రంగంలోకి దింపారన్న చర్చ జరిగింది. సుధాగజపతి, ఊర్మిళ వెనక వుండి, అశోకే చక్రంతిప్పుతున్నారన్న అభిప్రాయమూ ఏర్పడింది. అయితే, తాజాగా సిరిమానోత్సవం రగడ ఎపిసోడ్‌, పూసపాటియుల గొడవలో, మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది.

సిరిమానోత్సవం వీక్షిస్తుండగా, సంచైత తమను బలవంతంగా వెళ్లగొట్టారని, ఇది ఆమె అహంకారానికి నిదర్శనమంటూ, తర్వాతి రోజు మీడియా సమావేశం పెట్టి మరీ అస్త్రాలు ఎక్కుపెట్టారు ఊర్మిళ. ఇదే మీటింగ్‌లో, తొలిసారి బాబాయ్‌ అశోక్‌పై, ఆమె విమర్శలు చెయ్యడం చర్చనీయాంశమైంది. మొన్నటి వరకు మాన్సాస్‌‌పై ఇంత రగడ జరుగుతున్నా ఏనాడూ అశోక్‌పై పల్లెత్తు మాటా అనలేదు ఊర్మిళ. ఫస్ట్‌ టైమ్‌ ఆమె కూడా, సంచైత తరహాలో బాబాయ్‌పై విమర్శల బాణాలు సంధించడం ట్విస్ట్‌గా మారింది.

మాన్సాస్‌ వ్యవహారంపై ఏనాడూ బాబాయ్‌ తమతో సంప్రదించలేదన్నారు ఊర్మిళ. మాట్టాడ్డానికి, సంప్రదింపులు జరపడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా వినిపించుకోలేదన్నారు. సంచైతపై తాము ఒంటరిగానే న్యాయ పోరాటం చేస్తున్నామని, ఊర్మిళ చెప్పడంతో, మాన్పాస్ వ్యవహారంపై రాజకుటుంబీకులు త్రిముఖంగా యుద్దాలు చేస్తున్నారని అర్థమవుతోంది. సంచతై, ఊర్మిళ ఒకరినొకరు టార్గెట్ చేస్తూనే, బాబాయ్‌నూ విమర్శిస్తున్నారు. ఈ పరిణామంతో ఊర్మిళ వెనక అశోక్‌ లేరని అర్థం చేసుకోవాలా? లేదంటే వ్యూహాత్మకంగానే ముగ్గురూ విమర్శలు చేస్తున్నారనుకోవాలా? రాబోయే రోజుల్లో గజపతుల యుద్ధం ఇంకెలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Full View


Tags:    

Similar News