New Twist: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్‌

New Twist: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ.

Update: 2021-06-12 05:06 GMT

Ex Minster YS Vivekananda Reddy:(File Image)

New Twist: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచినట్లే కనపడుతోంది. కాని సాక్ష్యాలను మాయం చేయాలని చూసినవారిపైన కన్నా... వివేకాతో లావాదేవీలున్నవారిని.. వివాదాల సెటిల్ మెంట్లకు వచ్చినవారిని.. హత్యకు ముందు అక్కడ తిరిగిన అనుమానితులను విచారిస్తోంది. వివేకా కుమార్తె సునీతారెడ్డి ఆరోపించిన పేర్లను వదిలేసి.. డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్ల చుట్టూ విచారణ నడిపిస్తోంది. మరి వీళ్ల ద్వారా లింకును అక్కడి దాకా తీసుకెళ్తుందో.. ఇంకెక్కడి దాకా తీసుకెళ్తుందో తెలియదు గాని.. ఐదు రోజుల నుంచి బిజిబిజీగా సీబీఐ అధికారులు విచారణలో మునిగిపోయారు.

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు వరుసగా ఐదో రోజు శుక్రవారం కూడా విచారణ కొనసాగించారు. విచారణకు వివేకా మాజీ డ్రైవరు దస్తగిరితో పాటు వైసీపీ కార్యకర్త కిరణ్‌కుమార్‌యాదవ్‌, రవాణాశాఖ సిబ్బంది హాజరయ్యారు. హత్య జరగడానికి 15 రోజుల ముందు వివేకాను కిరణ్‌కుమార్‌యాదవ్‌ కలిసినట్లు సీబీఐ వద్ద ప్రాథమిక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత కొన్ని నెలలుగా వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరిని కూడా సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో వివేకానంద కేసులో కీలక సమాచారం లభించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హత్య జరిగిన రోజు వివేకా ఇంటి పరిసరాల్లో కొన్ని అనుమానిత వాహనాలు తిరిగినట్టు సీబీఐ గుర్తించింది. దీనికి బలం చేకూర్చేందుకు AP-04-1189 నెంబర్‌ గల ఇన్నోవా వాహనం ఓనర్‌ అయిన అరకటవేముల రవి, డ్రైవర్‌ గోవర్ధన్‌లను కలిపి విచారణ చేశారు. వీరి ద్వారా వచ్చిన ఇన్‌ఫర్మేషన్‌ను రికార్డు చేసుకున్నారు. రవాణా శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇన్నోవా వాహనం యజమానిని సీబీఐ అధికారులు విచారించినట్టు సమాచారం. దీంతో ఈ కేసు విచారణలో కీలకంగా మారింది ఇన్నోవా కారు. హత్యకు ముందు ఇన్నోవా కారులో వచ్చిన వారిపై సీబీఐ ఆరా తీస్తోంది. ఇప్పటికే మాజీ డ్రైవర్‌ దస్తగిరి, ఇనాయతుల్లాను విచారించారు. అటు తర్వాత సునీతారెడ్డితో కలిసి వివేకా నివాసాన్ని సీబీఐ అధికారులు పరిశీలించారు.

Tags:    

Similar News