Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం.. ఒకట్రెండు రోజుల్లో..
New Districts in Andhra Pradesh: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.
Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం.. ఒకట్రెండు రోజుల్లో..
New Districts in Andhra Pradesh: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేర్చే దిశగా సీఎం జగన్ ఇప్పుడు అడుగులు వేస్తున్నారు.
ఎట్టకేలకు ఈ హామీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవుతోంది. రెండురోజుల్లో నోటీఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలుంటే.. 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేదిశగా ప్రక్రియ ప్రారంభమైనట్టు స్పష్టమవుతోంది. అరకు పార్లమెంట్ సెగ్మెంట్ భౌగోళిక రిత్యా చాలా విస్తారమైనది కావడంతో ఆ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చిన్న చిన్న మార్పులు - చేర్పులు ఉంటాయని తెలుస్తోంది.