నిమ్మగడ్డకు ఏపీ సీఎస్ లేఖ!

ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టం చేశారు‌. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చి రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని అంచనా వేయడం సరికాదన్నారు.

Update: 2020-11-18 02:12 GMT

ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టం చేశారు‌. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చి రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని అంచనా వేయడం సరికాదన్నారు. ఇక చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించిందని సీఎస్‌ గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 6వేల 890 మంది కరోనాకు బలయ్యారన్న సీఎస్.. మరోసారి కరోనా ప్రబలేలా చర్యలు తీసుకునేందుకు తాము సిద్దంగా లేమన్నారు.

ఇక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించడం ప్రాణాంతకమని, ఇప్పటికే పరిపాలన సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వివిధ శాఖలు, కరోనా కట్టడికి కృషి చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు సీఎస్. స్థానిక సంస్థల నిర్వహణకు... పరిస్థితి అనుకూలించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణపై సమాచారం ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా.. ఫలానా సమయంలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదని లేఖలో స్పష్టం చేశారు.

ఎన్నికల నిర్వహణపై నిర్ణయాన్ని పునరాలోచించాలన్నారు. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి తీసుకువచ్చారన్న సీఎస్.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని తాము భావిస్తున్నామన్నారు.

Tags:    

Similar News