Chandrababu: ద్రౌపదీ ముర్మూ రాష్ర్టపతి అభ్యర్ధిగా బరిలో ఉండటం మన అదృష్టం

Chandrababu: ద్రౌపది ముర్ము ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు

Update: 2022-07-12 14:25 GMT

Chandrababu: ద్రౌపదీ ముర్మూ రాష్ర్టపతి అభ్యర్ధిగా బరిలో ఉండటం మన అదృష్టం

Andhra News: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ ఎన్నికలో భాగస్వామ్యం కావడం అందరి అదృష్టమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మారుమూల గ్రామంలో, పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ముర్మూ.. అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. గిరిజనులు, ఆదివాసీలను అభివృద్ధి చేయడం అరుదుగా జరుగుతుందని, సామాజిక న్యాయం కోసం ముర్మూను బలపరచాలని తెదేపా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్మూను ఎంపిక చేసిన ప్రధాని మోదీకి ఈ సందర్భంగా చంద్రబాబు అభినందనలు తెలిపారు.

గతంలో అబ్దుల్‌ కలాం, రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నిక వేళ మద్దతిచ్చామని వివరించారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ మంగళవారం ఏపీకి వచ్చారు. తొలుత మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌కు వెళ్లి.. తనకు మద్దతివ్వాలని వైకాపా ప్రజాప్రతినిధులను కోరారు. అనంతరం విజయవాడలో తాజ్‌ గేట్‌ వే హోటల్‌కు చేరుకున్న ముర్మూకు చంద్రబాబు స్వాగతం పలికారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, సోము వీర్రాజు, సీ.ఎం రమేశ్‌, జీవీఎల్‌, మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి, తెదేపా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తనకు మద్దతు తెలిపినందుకు తెదేపాకు ముర్మూ కృతజ్ఞతలు తెలిపారు. 

Tags:    

Similar News