నవరత్నాల అజెండా..ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు

Update: 2019-06-24 04:51 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 13 జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఎన్నికల ముందు వైసీపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, పారదర్శక పాలనే లక్ష్యంగా ఈ సదస్సులో కలెక్టర్లకు జగన్ నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో పాటు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌‌, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌‌,వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో నేడు ఆరు అంశాలపై జగన్ చర్చించనున్నారు. తొలి రోజు కలెక్టర్ల సదస్సు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయానికి వెళ్లనున్నారు. పాలనపరమైన కార్యక్రమాలు ముగిసిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. దీంతో పాటు ఈ రోజు రాత్రి IASలకు సీఎం వైఎస్‌‌ జగన్‌‌ విందు ఇవ్వనున్నారు. 

Tags:    

Similar News