Andhra Pradesh: ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Update: 2020-01-25 08:16 GMT

బద్వేల్: పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణ వీధులలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ వెంకటరెడ్డి, మండల అభివృద్ధి అధికారి రామకృష్ణయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండటం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

నియోజకవర్గంలో 272 బి ఎల్ వో కేంద్రాలు ఉన్నాయని వీటి పరిధిలో ప్రతి గ్రామ పంచాయతీ వద్ద ఓటు నమోదు చేసుకునేందుకు ఆస్కారం కల్పించినట్లు తెలిపారు. అనంతరం రంగోలి పోటీలలో, వ్యాసరచన, వకృత్వ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రామచంద్రయ్య, ఎన్నికల ప్రత్యేక అధికారి రామచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.


Tags:    

Similar News