నారా లోకేష్‌ను ప్రశ్నిస్తున్న సీఐడీ.. సీఐడీ ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్న లోకేష్‌

Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ విచారణ కొనసాగుతోంది.

Update: 2023-10-10 11:14 GMT

నారా లోకేష్‌ను ప్రశ్నిస్తున్న సీఐడీ.. సీఐడీ ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్న లోకేష్‌

Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ విచారణ కొనసాగుతోంది. ఆరున్నర గంటలుగా లోకేష్‌ను సీఐడీ విచారిస్తోంది. హెరిటేజ్‌ బోర్డు మీటింగ్ నిర్ణయాలపై సీఐడీ లోకేష్‌పై ప్రశ్నలు కురిపించినట్లు తెలుస్తోంది. అయితే హెరిటేజ్‌ నిర్ణయాలు తనకు తెలియదని లోకేష్‌ చెప్పడంతో.. లోకేష్‌ సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు చూపించి ప్రశ్నలు సంధించింది సీఐడీ. దీంతో లోకేష్‌ సమాధానాలు దాటవేస్తున్నారు. ప్రతీ ప్రశ్నకు లోకేష్‌ లాయర్లతో సంప్రదించి సమాధానాలు చెబుతున్నారు. ఇక హెరిటేజ్‌ భూములు ఇన్నర్ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్ చేసిన ప్రాంతంలో ఎందుకు కొన్నారని ప్రశ్నలు వేయగా.. లోకేష్‌ పొంతన లేని సమాధానం చెప్పినట్లు సమాచారం.

Tags:    

Similar News