నేనడిగితే జగన్ ఆ పదవి ఇచ్చేవాడు.. కానీ..

Update: 2019-11-18 02:45 GMT

ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి నియమితులైన సంగతి తెలిసిందే. అయితే వైసీపీలో తొమ్మిదేళ్లుగా ఆమె ఉన్నారు. ఆమె కోరుకుంటే ఇంతకంటే పెద్ద పదవి వచ్చేది.. కానీ ఆమె తెలుగు అకాడమీ చైర్ పర్సన్ పదవినే తీసుకున్నారు. ఇలా ఎందుకు జరిగిందో లక్ష్మీపార్వతే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తాను కోరుకుంటే ఏ పదవి ఇచ్చేందుకైనా జగన్ సిద్ధంగా ఉన్నాడని తెలిపారు.

"నేను కోరుకోవాలే కానీ ఆ అబ్బాయి నిజంగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చేవాడు. అయితే నాకు తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం అంటే చాలా ఇష్టం. వాటికి దగ్గరగా ఉండే పదవినే కోరుకున్నాను. ఈ విషయం తెలిసి ఇంత చిన్న పదవి తీసుకుంటున్నారా ఆమె? అని అడిగారట. లక్ష్మీపార్వతికి ఏది ఇష్టమైతే అది ఇవ్వండి అని ముఖ్యమంత్రి జగన్ చెప్పారట" అంటూ లక్ష్మీపార్వతి వెల్లడించారు. కాగా ఎన్టీఆర్ సతీమణిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు లక్ష్మీపార్వతి. ఆయన మరణాంతరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొంతకాలానికి బీజేపీలో చేరి ఆ తరువాత 2011 లో నెల్లూరులో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ ప్రధానకార్యదర్శిగా ఆమె ఉన్నారు. 

Tags:    

Similar News