Nandamuri Ramakrishna: తారకరత్న గుండె, లివర్, ఇతర అవయవాలన్నీ నార్మల్ స్థితికి వచ్చాయి

తారకరత్న ఆరోగ్యం మెరుగ్గా ఉంది

Update: 2023-01-30 11:22 GMT

Nandamuri Ramakrishna: తారకరత్న గుండె, లివర్, ఇతర అవయవాలన్నీ నార్మల్ స్థితికి వచ్చాయి

Taraka Ratna: బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం మెరుగ్గా ఉందని నందమూరి రామకృష్ణ అన్నారు. శరీర అవయవాలు ఫంక్షనింగ్ ఉందని చెప్పారు. గుండె, లివర్, ఇతర అవయవాలన్నీ నార్మల్ స్థితికి వచ్చాయన్నారు. పార్షియల్ వెంటిలేషన్ మీద చికిత్స అందిస్తున్నారని తెలిపారు. త్వరలోనే తారకరత్న మామూలు మనిషిగా బయటికి వస్తారని రామకృష్ణ ధీమా వ్యక్తంచేశారు. చికిత్స కోసం ఎక్మో పరికరాన్ని అమర్చారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News