Nalgonda: నల్గొండలో షాకింగ్ ఘటన.. రెండేళ్ల బిడ్డను బస్టాండ్‌లో వదిలేసి ప్రియుడితో పరారైన తల్లి
Nalgonda: నల్గొండలో షాకింగ్ ఘటన.. రెండేళ్ల బిడ్డను బస్టాండ్‌లో వదిలేసి ప్రియుడితో పరారైన తల్లి
నల్గొండలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తల్లి రెండేళ్ల కుమారుడిని బస్టాండ్‌లో వదిలేసి, ప్రియుడితో కలిసి వెళ్లిపోవడం కలకలం రేపింది. తల్లి కనిపించకపోవడంతో చిన్నారి గుక్కపట్టి ఏడుస్తుండగా, ఆర్టీసీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.
ప్రియుడి కోసం బిడ్డను వదిలేసిన తల్లి
వివరాల్లోకి వెళితే.. నల్గొండకు చెందిన ఓ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక మహిళ పరిచయమైంది. ప్రియుడిని కలుసుకోవడానికి ఆమె హైదరాబాద్ నుంచి నల్గొండ చేరుకుంది. బస్టాండ్‌లో కుమారుడిని వదిలేసి, బైక్‌పై ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.
సీసీ కెమెరాలతో పట్టుబడ్డ జంట
సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు వారి జాడను గుర్తించారు. అనంతరం ఆ మహిళ, ప్రియుడిని పీఎస్‌కి తీసుకువచ్చి విచారించారు. మహిళ ఇచ్చిన వివరాల ప్రకారం, ఆమె భర్తను పిలిపించి బిడ్డను అతడికి అప్పగించారు.
సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్న తల్లి ఇలా ప్రవర్తించడం పై సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.