చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటుపై నాగబాబు క్లారిటీ

Update: 2020-03-04 15:29 GMT
నాగబాబు , జగన్, చిరంజీవి ఫైల్ పోటో

టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి వైసీపీ రాజ్యసభ సభ్యత్వంపై ఆయన సోదరుడు నాగబాబు క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే చిరంజీవి, ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. దీంతో వైసీపీ రాజ్యసభ సీటు చిరంజీవికి ఖాయమైందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నాగబాబు ఆయన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఖండించారు. మెగా అభిమానుల్లో ఉన్న గందరగోళం క్లియర్ చేయడానికే తాను వచ్చానని చెప్పారు. చిరంజీవిని కొందరు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు.

ప్రస్తుతం చిరంజీవి జనసేన సహా ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని స్పష్టం చేశారు. పవన్ ఆలోచనలను ఓ అన్నగా చిరంజీవి సమర్థిస్తున్నాడని తెలిపారు. రాజ్యసభ సభ్యత్వం వస్తుందని కొందరు తప్పుడు వార్తలతో గందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు. ఆయన పూర్తిగా సినిమాలకు పరిమితం అవుతారని నాగబాబు అన్నారు. రాజకీయాలు పూర్తిగా వదిలేశారని, సినిమాలపైనే ఆయన మనస్సు ఉందని స్పష్టం చేశారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్వకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. కొరాటాల సినిమా తర్వాత మరో సినిమా చెస్తారని వెల్లడించారు. మెగా కుంటుంబంలో అందరికంటే చిరంజీవే సినిమాల్లో బిజీగా ఉన్నారని అన్నారు. అన్నయ్యకు ఏ పార్టీలోకి వెళ్లినా గొప్ప స్వాగతం ఉంటుందని పేర్కొన్నారు.

 

Tags:    

Similar News