ఏపీ అసెంబ్లీలో కల్తీ సారా మరణాలపై జరిగిన... చర్చపై స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు
వైసీపీ ప్రభుత్వం ఉన్నపలంగా శాసన సభలో.... ప్రకటన చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ‌్న
ఏపీ అసెంబ్లీలో కల్తీ సారా మరణాలపై జరిగిన... చర్చపై స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు
Nagababu: ఏపీ అసెంబ్లీలో జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాలపై జరిగిన చర్చపై మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీసారా వల్ల చనిపోలేదంటూ వైసీపీ ప్రభుత్వం ఉన్నపలంగా శాసన సభలో ప్రకటన చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. క్రిమినల్స్‌ను ఇంతగా వైసీపీ ప్రభుత్వం ఎందుకు సమర్థిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం ఎక్వైరీ వేసి నేరస్థులను పట్టుకునే ప్రయత్నం చేయాలని కోరారు. మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.