Nadendla Manohar: పవన్, బాబు కటౌట్లకు పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి పైశాచికానందం పొందారు
Nadendla Manohar: ఏపీ సీఎం జగన్ చర్యలను మేమంతా ఖండిస్తున్నాం
Nadendla Manohar: పవన్, బాబు కటౌట్లకు పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి పైశాచికానందం పొందారు
Nadendla Manohar: భీమిలిలో మూడు రోజుల క్రితం వైసీపీ నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఏపీ సీఎం జగన్ ఐదేళ్లలో ఏం చేశారో చెప్పలేక పోయారని జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.మరోసారి అవకాశం కల్పిస్తే ఏ విధంగా పాలిస్తారో చెప్పాల్సిన జగన్ సంస్కారం మరిచారని ఎద్దేవా చేశారు. ఆ సభలో తమ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కటౌట్లకు పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి పైశాచిక ఆనందం పొందారని అన్నారు. ఏపీ రాజకీయాల్లో ఎఫ్పుడూ లేని విధంగా చేసిన సీఎం చర్యలను తాము ఖండిస్తున్నామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా పాలకులు తీరు ఉందన్నారాయన.