విశాఖ చిన్నారి సింధు హత్య కేసులో వీడిన మిస్టరీ.. తల్లి ప్రియుడే హంతకుడు

Visakhapatnam: చిన్నారి అని కనికరం చూపలేదు చిట్టితల్లి కన్నీళ్లకు ఆ గుండె కరగలేదు అత్యంత దారుణంగా హత్య చేసి, అర్థరాత్రి స్మశానంలో పూడ్చిపెట్టాడు.

Update: 2021-06-06 04:30 GMT

విశాఖ చిన్నారి సింధు హత్య కేసులో వీడిన మిస్టరీ.. తల్లి ప్రియుడే హంతకుడు

Visakhapatnam: చిన్నారి అని కనికరం చూపలేదు చిట్టితల్లి కన్నీళ్లకు ఆ గుండె కరగలేదు అత్యంత దారుణంగా హత్య చేసి, అర్థరాత్రి స్మశానంలో పూడ్చిపెట్టాడు. అంతా అయిపోయాక అనారోగ్యంతో చనిపోయిందంటూ కట్టు కథలు అల్లాడు. చివరికి పోలీసుల విచారణలో నిజం ఒప్పుకుని కటకటాల పాలయ్యాడు.

విశాఖ మధురవాడలో చిన్నారి సింధు హత్య కేసు మిస్టరీ వీడింది. సింధు మర్డర్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీఎంపాలెం పోలీసులు 30 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. మొదట నుంచి అందరూ అనుమానిస్తున్నట్టే జగదీషే హంతకుడని పోలీసులు తమ విచారణలో తేల్చారు. సింధు తల్లి వరలక్ష్మితో జగదీష్ గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరి మధ్య చిన్నారి సింధు అడ్డంగా ఉందని భావించారు. అయితే, హత్యలో జగదీష్ యే హంతకుడని తేలినా వరలక్ష్మి పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరోవైపు పీఎంపాలెం పోలీసుల విచారణలో హంతకుడు జగదీష్ నమ్మలేని నిజాలు బయటపెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మొదట చిన్నారిని కొట్టి గాయపరిచినట్లు తెలిపాడు. అనంతరం చిన్నారికి ఒంట్లో బాలేదని నమ్మించేందుకు పలు ఆస్పత్రులకు తీసుకెళ్లి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అర్థరాత్రి రహస్యంగా సింధు అంత్యక్రియలు జరిపి అనారోగ్యంతోనే చిన్నారి మృతిచెందినట్లు కట్టు కథ అల్లాడు.

చిన్నారి సింధును జగదీషే హతమార్చాడని తెలుసుకున్న గ్రామస్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అభంశుభం తెలీని పసిపాపను చిత్రహింసలకు గురి చేసి మరీ హత్య చేశాడని, అలాంటి మృగానికి ఉరిశిక్ష విధించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసు విచారణలో తానే హత్య చేశానని ఒప్పుకున్నా ఇంకా పలు అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. కన్నబిడ్డను చంపినా వరలక్ష్మి ఎందుకు మౌనంగా ఉందనేది చర్చనీయాంశంగా మారింది. చిన్నారిని హత్య చేసేందుకు ఆమె కూడా సాయం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News