MV Maa: విశాఖ పర్యాటక రంగానికి మరో మణిహారం

MV Maa: విశాఖ పర్యాటక మణిహారంలో ఓ వినూత్న రెస్టారెంట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

Update: 2021-11-29 07:53 GMT

MV Maa: విశాఖ పర్యాటక రంగానికి మరో మణిహారం

MV Maa: విశాఖ పర్యాటక మణిహారంలో ఓ వినూత్న రెస్టారెంట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. విశాఖ తీర ప్రాంతంలో ఓ నౌకలో ఆధునిక సదుపాయాలతో రెస్టారెంట్‌ ఏర్పాటుకు పర్యాటక అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిరుపయోగంగా పడిఉన్న బంగ్లాదేశ్‌‌కు సంబంధించిన "ఎంవీ మా" కు కొత్త మెరుగులు దిద్దనున్నారు.

బంగ్లాదేశ్‌ నుంచి విశాఖా పోర్టుకు నిత్యం రాకపోకలు సాగించే ఎంవీ మా నౌక గతేడాది సెప్టెంబర్‌ 19న కూడా వచ్చింది. ఐతే డాక్యుమెంట్ల విషయంలో సమస్య తలెత్తడంతో అవుటర్‌ హార్బర్‌లోని యాంకరేజ్‌లో ఉండిపోయింది. అదే సమయంలో వాయుగుండం కారణంగా బలమైన గాలుల ధాటికి షిప్‌ తీరం వైపుకు కొట్టుకొచ్చి ఇసుకలో కూరుకుపోయింది. సరిగ్గా యాంకరేజ్‌ చేయకపోవడమే షిప్‌ కొట్టుకొచ్చినట్లు అప్పట్లో అధికారులు దృవీకరించారు. దాన్నీ తిరిగి సముద్రంలోకి పంపడానికి పోర్టు, కోస్టుగార్డు, తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ విఫలయత్నం చేసాయి. చివరికి బంగ్లాదేశ్‌కు చెందిన షిప్‌ యజమాని అందులోని విలువైన యంత్ర సామగ్రి తీసుకెళ్లిపోయి కేవలం నౌకను మాత్రం వదిలేశారు.

ఇప్పటికే బీచ్‌లో కురుసురా జలంతర్గామి, టీయూ 142 యుద్ధవిమానాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఎంవీ మా ను అదే పద్ధతిలో అభివృద్ధి చేస్తే విశాఖ పర్యాటక రంగానికి మరో మణిహారంగా మారుతుందని అధికారులు బావిస్తున్నారు. ఆ కోవలోనే ఈ నౌకలో హోటల్ ఏర్పాటు చేయడంతో పాటుగా టూరిస్టులను ఆకట్టుకునేలా పలు సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ నౌకను ఎలా ఉఫయోగించుకోవాలి అనే దానిపై టూరిజం శాఖ అధికారులతో అధ్యయనం చెసిందని ఈ సంవత్సరంలోనే ఈ నౌక పనులు ప్రారంభించడానికి సిద్దపుడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News