Mudragada Padmanabham: ఏపీ సీఎం జగన్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ..
Mudragada Padmanabham: సంక్రాంతి పండుగ ఐదు రోజులూ కోడిపందాల అనుమతికి.. పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని లేఖలో కోరిన ముద్రగడ
ఏపీ సీఎం జగన్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ(ఫైల్-ఫోటో)
Mudragada Padmanabham: ఏపీ సీఎం జగన్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ రాశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఐదు రోజులూ కోడిపందాల పర్మిషన్‌కు పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని లేఖలోకోరారు. కోడి పందాలు వంటివి జల్లికట్టు కంటే ప్రమాదకరమైన ఆటలు కావని గ్రామాల్లో సంక్రాంతికి ఎడ్ల పందాలు, కోడిపందాలు, జాతర్లు ఆచారమని తెలిపారు.
ఇటీవల సంక్రాంతికి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అనేక ఇబ్బందులు పెడుతున్నారని లేఖలో ప్రస్తావించారు. చివరికి పర్మిషన్ ఇచ్చేయటంతో పోలీస్ శాఖ కూడా ఇబ్బంది పడుతోందని అన్నారు. అలాగే పండుగుల సమయంలో ప్రజలకు పని ఉండదు కాబట్టి ఉత్సవాల్లో పాల్గొంటారని వివరించారు.