వైసీపీ ఎన్నికల ప్రచారం పాటలు.. డ్యాన్స్‌లతో ఇరగదీసిన తహసీల్దార్

Update: 2019-11-19 03:48 GMT

గత ఎన్నికల ప్రచారం సందర్బంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించిన 'రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న' అనే పాటకు తహసీల్దార్ స్టెప్పులు ఇరగదీశారు. శ్రీకాకుళం జిల్లా భామినిలో ఈ ఘటన జరిగింది. వైసీపీ పాటకు తహసీల్దార్ డ్యాన్స్ వేయడం ఆ వీడియో ఎవరో సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అది కాస్త వైరల్ గారిది. ఇకార్తీకమాసం సందర్భంగా భామినిలోని నేరడి బ్యారేజ్ వద్ద వైసీపీ కార్యకర్తలు వనభోజనాలు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి భామిని తహసీల్దార్ ఎస్.నర్సింహమూర్తి, ఇతర రెవెన్యూ సిబ్బంది ముఖ్య అథిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రచార గీతాలను ప్లే చేశారు. దాంతో ఉత్సాహంతో ఊగిపోయిన ఈ తహసీల్దార్ ఇరగదీసేలా స్టెప్పులేశారు. కార్యకర్తలతో కలిసి మైమరిచిపోయి డ్యాన్స్ చేశారు. అయితే దీనిపై కొందరు విశ్లేషకులు మండిపడుతున్నారు. 

Tags:    

Similar News