MPTC, ZPTC: రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

MPTC, ZPTC: కౌంటింగ్‌కు ముమ్మర ఏర్పాట్లు చేసిన అధికారులు

Update: 2021-09-18 02:26 GMT
రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు (ఫైల్ ఇమేజ్)

MPTC, ZPTC: ఏపీలో చాలా రోజులుగా పూర్తి కాని ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగనుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన పరిషత్ ఎన్నికల పోలింగ్ ను రద్దు చేస్తూ కొద్ది రోజుల క్రితం ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీని పైన ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. పిటీషనర్లు..ఎన్నికల సంఘం తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దీంతో..తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులను తోసి పుచ్చింది. ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అనుమతి ఇచ్చింది.

కోర్టు నుంచి క్లియరెన్స్ రావటంతో ఎన్నికల సంఘం రేపు పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం చేసింది. కోర్టు తీర్పు మేరకు పూర్తిగా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.

మొత్తం 515 జెడ్పీటీసీ 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఈ పోలింగ్ జరగనుంది. ఏపీలో మొత్తంగా 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో 2,371 ఏకగ్రీవం అయ్యాయి. 375 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 81 చోట్ల అభ్యర్దులు మరణించటంతో ఎన్నిక వాయిదా పడింది. రాష్ట్రంలో అదే విధంగా 660 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 126 ఏకగ్రీవం అయ్యాయి. 8 చోట్ల ఎన్నికలు జరగలేదు. 11 చోట్ల అభ్యర్దుల మరణంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఇక, కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో, పోటీ చేసిన అభ్యర్ధుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏపీలో జరిగిన పంచాయితీ మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించిన వైసీపీ ఈ ఫలితాలు తమకు ఏకపక్షంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఫలితాల అనంతరం విజయోత్సవాలు నిర్వహించరాదని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోగా కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను ఆర్వోలకు అందజేయాలని సూచించారు. 

Full View


Tags:    

Similar News