ముందు మీ నలుగురు పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించండి : ఎంపీ విజయసాయి రెడ్డి
ఆరునెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వాన్ని ఆరు పదాలతో పోల్చి విమర్శలు గుప్పించారు పవన్. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో.. 'మన నుడి, మన నది. సినిమా టైటిల్లాగా అదిరిపోయింది. ముందు మీ నలుగురు పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించి నుడికారాన్ని మొదలు పెట్టాలి.
తర్వాత మీకు ప్యాకేజి ఇచ్చే యజమాని కృష్ణా నదిని పూడ్చి నిర్మించిన కరకట్ట నివాసాన్ని తొలగించాలని ఆందోళన చేయాలి. అప్పుడు నదుల రక్షణ సఫలమవుతుంది.' అంటూ పేర్కొన్నారు. అలాగే ఇంగ్లిష్ మీడియం బోధనకు వ్యతిరేకం కాదని చంద్రబాబు నాలుక మడతేశాడని విమర్శించారు. అసలు యూదు బాషలో రాసిన బైబిల్ కు ఇంగ్లిష్ కు ఏ సంబంధం అని అందరూ ప్రశ్నిస్తున్నారని అన్నారు.