ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదో చిరస్మరణీయైన రోజు .. ఎంపీ విజయసాయిరెడ్డి

గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే

Update: 2020-05-23 15:17 GMT
YS Jagan, MP vijayasai reddy(File photo)

గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. గతేడాది మే 11వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగగా, మే 23న ఫలితాలు వచ్చాయి. అంటే ఈ రోజుతో(శనివారం) ఏడాది పూర్తి అయ్యింది అన్నమాట.. ఈ ఎన్నికల్లో టీడీపీకీ 44 శాతం, సీపీఐకి 3.39 శాతం, సీపీఎంకు 2.96 శాతం ఓట్లు వచ్చాయి. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగిన వైఎస్సార్‌ సీపీ 250 శాతం ఓట్లతో భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'తొమ్మిదేళ్ల పాటు ఎన్నెన్ని కుట్రలు. జైలుకు పంపడం. అభిమన్యుడిలా ఒంటిరివాడిని చేసి మట్టుపెట్టాలని చూశారు. కర్ణుడిలా అశక్తుడిని చేసి హతమార్చాలని స్కెచ్చులు వేశారు. ఆ గుండె ధైర్యం, పట్టుదలల ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదు. ప్రజలకు జీవితకాల భరోసాగా నిల్చాడు యువనేత'అని ట్వీట్‌ చేశారు.

అంతేకాకుండా.. ఏడాది క్రితం ఇదే రోజు, 'ఫ్యాన్' ప్రభంజనాన్ని దేశమంతా కళ్లార్పకుండా చూసింది. ఏకపక్ష విజయంతో చరిత్రను తిరగరాశారు జననేత జగన్ గారు. తన వెంట నడిచిన ప్రజల కోసం 'పది తలల విషనాగు'తో పోరాడారాయన. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, వేల కోట్లు వెదజల్లిన పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారు' అంటూ మరో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి! 




 


Tags:    

Similar News