Andhra Pradesh: ఏపీ అప్పుల్లో కూరుకపోయింది: ఎంపీ రఘురామకృష్ణం రాజు
Andhra Pradesh: కొత్తగా మూడు పోర్టుల నిర్మాణం అవసరమా : రఘురామకృష్ణం రాజు
ఎంపీ రఘురామకృష్ణ (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: ఏపీని వైసీపీ ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆరోపించారు. అప్పుల్లో కురకపోయిన రాష్ట్రంలో కొత్తగా మూడు పోర్టుల నిర్మాణం అవసరమా అని ఆయన నిలదీశారు. ఈ పోర్టుల నిర్మాణానికి ఇంకెంత అప్పుచేస్తారో. ఇంకేం అమ్ముతారో అని ఎంపీ రఘురామకృష్ణం రాజు నిలదీశారు. అనుభవం లేని మందుల కంపెనీకి పోర్టుల నిర్మాణాల కాంట్రాక్ట్ అవసరమా అన్నారు.
ఉన్న ఆస్పత్రులను మెరుగుపర్చకుండా.. కొత్త హాస్పిటల్స్ కడతామని వైసీపీ ప్రభుత్వం హామీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు ఎద్దెవా చేశారు. తప్పుడు సెక్షన్లతో నన్ను అట్రాసిటీ కేసుల్లో ఇరికించాలని ఆయన ఆరోపించారు. దీనిపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశానని ఆయన అన్నారు. త్వరలో హోంమంత్రి అమిత్ షా ను కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పుకచ్చారు.