MP Raghu Rama Krishnam Raju letter to YS Jagan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పింది..

MP Raghu Rama Krishnam Raju letter to YS Jagan: ఏపీలో రాజకీయాలు అధికార పార్టీలో కాక‌రేపుతున్నాయి. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చింది.

Update: 2020-06-29 09:56 GMT
Raghu Rama Krishnam Raju (File Photo)

MP Raghu Rama Krishnam Raju Letter to YS Jagan: ఏపీలో రాజకీయాలు అధికార పార్టీలో కాక‌రేపుతున్నాయి. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలపై అనుచితవ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ షోకాజ్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంపీ రఘురామకృష్ణ రాజు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి వచ్చిన నోటీసు అందిందని దానిపై స్పందిస్తూ ఈ లేఖ రాశానని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రిజిస్టరైన పార్టీ కాకుండా మరో పార్టీ లెటర్‌ హెడ్‌తో నోటీసు వచ్చిందని ఆయన తపపుబట్టారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే పేరును వాడుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందని పేర్కొన్నారు. అయితే సందర్భాల్లో ఈసీ మనపార్టీకి రాసిన లేఖలు దీన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఏ సందర్భంలోనూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని వాడుకునేందుకు అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసిందని ఆయన వివరించారు. అయితే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం తాను ఎప్పుడూ విధేయుడినేనని రఘు రమ కృష్ణంరాజు లేఖలో పేర్కన్నారు.

ఈ సందర్భంగా లేఖలో నేను శ్రీవారికి అపర భక్తుణ్ని. నేను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. మిమ్మల్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నా. పార్టీకి వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదు. స్వామివారి ఆస్తుల అమ్మకం అంశంలో భక్తుల మనోభావాలను వివరించా...ఈ వ్యవహారంలో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నట్లు చెప్పా. ఇసుక విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించా.

ఈ ప్రయత్నం నెరవేరకే మరో మార్గం లేక మీడియా ముందుకు వెళ్లా. రాజ్యాంగానికి లోబడే నేను మాట్లాడా. మీపైనా, పార్టీపైనా నేనెక్కడా మాట్లాడలేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కమాట మాట్లాడలేదు. మీ చుట్టూ ఉన్న కొందరు నన్ను క్రైస్తవ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి మిమ్మల్ని కలవకుండా చేస్తున్నది వారే అని రఘురామ రాజు సీఎం జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

విజయసాయరెడ్డి ఇచ్చిన షోకాజ్ నోటీస్ అందిందని పేర్కొంటూ విజ‌యసాయిరెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. అస‌లు వైసీపీలో క్రమశిక్షణ సంఘం ఉందా..క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందా..? సంఘం మినిట్స్ ఉంటే నాకు పంపండి.. క్రమశిక్షణ సంఘం చైర్మన్, సభ్యులు ఏవరు..? అంటూ విజ‌య‌సాయిరెడ్డికి సంబంధం ఎంటి అని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. ఇటీవలే రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్‌ ను కలిసి అధికారులను కలిసే షోకాజ్ నోటీసు పై ఫిర్యాదు చేశారు. 

Tags:    

Similar News