MP Kesineni Chinni: ధర్నాకు అనేక మంది మద్దతు జగన్ కోరినా ఎవరు రాలేదు
చంద్రబాబు కృషితో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అత్యధిక నిధులు - ఎంపీ కేశినేని చిన్ని
MP Kesineni Chinni: ధర్నాకు అనేక మంది మద్దతు జగన్ కోరినా ఎవరు రాలేదు
MP Kesineni Chinni: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధుల కోసం రెండు నెలలుగా కృషి చేస్తున్నామని, చంద్రబాబు కృషితో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావడం శుభపరిణామమని ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని అన్నారు. కరువు ప్రాంతంగా ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇచ్చారని కొనియాడారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి 900 కోట్లు కేటాయించారని చెప్పుకొచ్చారు.
వైసీపీ తమ ఉనికి కోల్పోకుండా ఢిల్లీలో ధర్నా చేశారని, ఆ ధర్నాకు అనేక మంది మద్దతు జగన్ కోరినా ఎవరు రాలేదని, కేవలం అఖిలేష్ యాదవ్ ఒక్కరే మద్దతు పలికారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ధర్నా ద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను ఆపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చిన్ని ఆరోపించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లినా రాష్ట్రానికి ఒక్క రూపాయి తీసుకురాలేదని అన్నారు. ఇప్పటికైనా జగన్ శవరాజకీయాలు మానేయాలని హితవు పలికారాయన.