Avinash Reddy: వివేకా హత్య కేసు విచారణపై ఎంపీ అవినాష్ రెడ్డి వీడియో రిలీజ్
Avinash Reddy: సీబీఐ విచారణ సరైన కోణంలో జరగడం లేదన్న అవినాష్
Avinash Reddy: వివేకా హత్య కేసు విచారణపై ఎంపీ అవినాష్ రెడ్డి వీడియో రిలీజ్
Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ సరైన కోణంలో విచారణ జరపడం లేదన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. వివేకా హత్యకు సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూ అవినాష్ రెడ్డి వీడియోను విడుదల చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుగుతున్న తీరు అందరికీ తెలియాలనే వీడియో చేస్తున్నట్ల ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పారు. సీబీఐ విచారణ జరుగుతున్నందున చాలా ఏళ్లుగా వైఎస్ వివేకా, ఆయన కూతురు, అల్లుడు గురించి మాట్లాడలేదన్నారు.
అప్రూవర్ థీయరీ మీదనే అబద్దాలు సృష్టించారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. సీబీఐ అధికారులు అప్రూవర్ చేసే విధానాన్ని సరిగ్గా పాటించలేదన్నారు. హత్యలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే సీబీఐ అభ్యంతరం చెప్పలేదని అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. కీలక నిందితుడికి సీబీఐ రిలీఫ్ ఇస్తున్నా.. సునీత ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.