Avinash Reddy: నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి

Avinash Reddy: ఉదయం 11 గంటలకు కోఠి సీబీఐ ఆఫీస్‌కు అవినాష్‌రెడ్డి

Update: 2023-05-19 03:21 GMT

 Avinash Reddy: నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి

 Avinash Reddy: మాజీ మంత్రి YS వివేకానందరెడ్డి హత్య కేసులో.. సహ నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ YS అవినాష్ రెడ్డి.. మరోసారి సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు.. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో హాజరు కానున్నారు. ఇందుకోసం... నిన్న సాయంత్రానికే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. నిజానికి ఈనెల 16నే.. సీబీఐ అవినాష్‌ రెడ్డికి కబురు పంపింది. పులివెందుల నియోజకవర్గంలో.. ముందే అనుకున్న కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందంటూ.. అవినాష్‌ 4రోజుల గడువు కోరారు. కానీ సీబీఐ అధికారులు రెండు రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. దీంతో ఈ రోజు విచారణకు అవినాష్ హాజరుకానున్నారు.

Tags:    

Similar News