Avinash Reddy: నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి
Avinash Reddy: ఉ.10:30కు అవినాష్‌రెడ్డిని విచారించనున్న సీబీఐ
Avinash Reddy: నేడు సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి
Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని నేడు సీబీఐ అధికారులు విచారించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఈనెల 25వరకు ఆయన్ను అరెస్ట్ చేయకుండా విచారణ జరపనున్నారు. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ఈనెల 25 వరకు అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 25 వరకు రోజూ అవినాష్ రెడ్డి విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. అవినాష్ విచారణ ఆడియో, వీడియో రికార్డు చేయాలని సూచించింది. 25న ముందస్తు బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది.