ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి CBI విచారణ.. న్యాయవాది సమక్షంలో విచారించిన అధికారులు
MP Avinash Reddy: వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ నేడు ముగిసింది.
ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి CBI విచారణ.. న్యాయవాది సమక్షంలో విచారించిన అధికారులు
MP Avinash Reddy: వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ నేడు ముగిసింది. హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్రపై విచారించారు. సుమారు నాలుగున్నర గంటల పాటు న్యాయవాది సమక్షంలో అవినాష్‌రెడ్డిని విచారించారు. జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10న అవినాష్‌ను విచారించిన సీబీఐ.. ఇవాళ కూడా ప్రశ్నించింది. మరోవైపు ఇప్పటికే తన విచారణపై స్టే ఇవ్వాలంటూ అవినాష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. సీబీఐ విచారణలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది.