Facilities For Corona Treatement: కరోనా చికిత్సకు మరిన్ని సౌకర్యాలు.. ఆస్పత్రులు పెంచి విస్తరించిన బెడ్స్

Facilities For Corona Treatement: కరోనా విలయ తాండవం చేస్తోంది. గతంలో రోజుకు పదుల సంఖ్యలో వచ్చే కేసులు ప్రస్తుతం వేలల్లోకి చేరుకుంది.

Update: 2020-08-01 02:51 GMT
Facilities For Corona Treatement

Facilities For Corona Treatement: కరోనా విలయ తాండవం చేస్తోంది. గతంలో రోజుకు పదుల సంఖ్యలో వచ్చే కేసులు ప్రస్తుతం వేలల్లోకి చేరుకుంది. ఇది ప్రస్తుతం పట్టణాలకే కాకుండాగ్రామాలకు విస్తరించింది. ఒక్కో గ్రామంలో టెస్టులు చేయించుకుంటే పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వీళ్లందరికీ చికిత్స అందించడం అంటే కాస్త కష్టమైన పనే. అయినా సాధ్యం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ వ్యాధికి చికిత్స కోసం అవసరాన్ని బట్టి, అస్పత్రులను బెడ్లను పెంచాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రోగి వ్యాధి బారిన పడ్డ 24 లోపు చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించింది.

కరోనా పట్ల భయాందోళనలు వద్దని, ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, తగినన్ని బెడ్లు ఉన్నాయని తెలిపింది. కరోనా బాధితు ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 138 ఆస్పత్రులను గుర్తించామని, వీటిల్లో 4300 ఐసీయూ పడకలు, 17,406 ఆక్సిజన్‌ సరఫరా కలిగిన బెడ్లు, 17,364 సాధారణ పడకలు అందుబాటులో ఉంచామని తెలిపింది.

కరోనా వైరస్‌ సోకి ఆస్పత్రికి వచ్చే వారికి అరగంటలోనే బెడ్‌ కేటాయించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ సర్వం సిద్ధమైంద ని అధికారులు వెల్లడించారు. పాజిటివ్‌ కేసుల్లో 85ు మంది ఇళ్లలోనే ఉండి కోలుకుంటున్నారన్నారు. మిగిలిన 15ు ఆస్పత్రుల్లో చేరినా, వారిలో 4ు మంది మాత్ర మే అత్యవసర వైద్య సేవల విభాగంలో చికిత్స పొందుతున్నారన్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 11ు మంది సాధారణ చికిత్సతో డిశ్చార్జ్‌ అవుతున్నారని తెలిపారు. శుక్రవారం నాటికి 14,450 పడకల్లో బాధితులు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. 104 కాల్‌ సెంటర్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

24 గంటల్లో చికిత్స మొదలవ్వాలి

కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయిన వారిని 6-8 గంటల్లోపు ఆస్పత్రికి చేర్చాలని, 24 గంటల్లోపు ఆ వ్యక్తికి చికిత్స ప్రారంభం కావాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశిచించింది. ఈ మేరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల నిర్వహణపై శుక్రవారం కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. వాటి ప్రకారం.. ఎవరికైనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే పీహెచ్‌సీ వైద్యాధికారులు ఆ వ్యక్తిని సంప్రదించి హోం ఐసోలేషన్‌ సరిపోతుందా లేదా ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం ఉందా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. హోం ఐసొలేషన్‌లో ఉన్న పాజిటివ్‌ వ్యక్తులకు ఆర్డర్‌ 59 ప్రకారం తగు చర్యలు తీసుకోవాలి. హోం ఐసొలేషన్‌లో ఉన్న కేసులను పీహెచ్‌సీ వైద్యాధికారులు ప్రతిరోజూ పర్యవేక్షించాలి. 

Tags:    

Similar News