తిరుమలలో అక్రమాలకు తెరలేపిన ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ.. ఎమ్మెల్సీతో పాటు డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించిన..
MLC Shaik Sabji: అతడో ప్రజాప్రతినిధి... అందరికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి.
తిరుమలలో అక్రమాలకు తెరలేపిన ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ.. ఎమ్మెల్సీతో పాటు డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించిన..
MLC Shaik Sabji: అతడో ప్రజాప్రతినిధి... అందరికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ తప్పు దారి పట్టాడు. తిరుమల శ్రీవారి సన్నిధిలోనే అక్రమాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ తరచు శ్రీవారి దర్శనానికి వస్తున్నాడు. అనుమానంతో టీటీడీ విజిలెన్స్ నిఘా వేసింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ తనిఖీల్లో నకిలీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకెళుతున్నట్లు గుర్తించారు.
ఇతర రాష్ట్రాల్లో ఉన్న భక్తులను హైదరాబాద్ లో ఉన్నట్లు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించాడు. ఎమ్మెల్సీ షేక్ షాబ్జి అదనపు ఈవో కార్యాలయంలో 14మందికి టికెట్లు ఇవ్వాలని కోరారు. 10 టికెట్లు మాత్రమే కార్యాలయం జారీ చేసింది. తనిఖీల్లో భక్తుల ఆధార్ కార్డులు నకిలీగా తెలిసిందని టీటీడీ విజిలెన్స్ వీజీవో గిరిధర్ తెలిపారు. డ్రైవర్ రాజుతో పాటు ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించామన్నారు. టికెట్ల కోసం లక్ష 5వేలు తీసుకున్నట్లు భక్తులు చెప్పారని తెలిపారు.