MLC Madhav: విజయనగరంలో బీజేపీ మహాధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ మాధవ్
*ప్రజలు నమ్మి అధికారమిస్తే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు -మాధవ్
ఎమ్మెల్సీ మాధవ్ (ఫైల్ ఫోటో)
MLC Madhav: ప్రజలు నమ్మి 151 సీట్లిస్తే సంక్షేమ పాలన పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. విలువైన ప్రభుత్వ భవనాలు, భూములను తాకట్టు పెట్టడమే కాకుండా, అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ ఏపీ సర్కార్ తిరుగుతోందని ఆయన ఆరోపించారు. విజయనగరంలో చేపట్టిన బీజేపీ మహాధర్నాలో పాల్గొన్న మాధవ్ రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిందన్నారు.