MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
MLC Elections: 4 గంటల వరకూ కొనసాగనున్న పోలింగ్
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
MLC Elections: పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ కొనసాగనుంది. అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల తో పాటు ఉమ్మడి కర్నూల్, కడప జిల్లాలోనూ పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 41 మంది బరిలో ఉండడంతో జంబో బ్యాలెట్ పేపర్‌తో పాటు జంబో బ్యాలెట్ బాక్స్ లను ప్రత్యేకంగా తెప్పించారు. దాదాపు అన్ని చోట్లా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు.