ఎమ్మెల్సీ అనంతబాబు మధ్యంతర బెయిల్ పొడగింపు
MLC Anantha Babu: ఈ నెల తొమ్మిది వరకు పొడగించిన హైకోర్టు
ఎమ్మెల్సీ అనంతబాబు మధ్యంతర బెయిల్ పొడగింపు
MLC Anantha Babu: హత్యకేసులో నిందితునిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మధ్యంతర బెయిల్‌ను సెప్టెంబరు తొమ్మిది వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మరణించిన తల్లి అస్థికలను గోదావరి, కృష్ణా, గంగానదిలో కలిపేందుకు బెయిలును పొడిగించాలని అనంతబాబు తరఫున సీనియర్ న్యాయవాది న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. ఆ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి మధ్యంతర బెయిల్‌ను తొమ్మిది వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. మరోవైపు బెయిల్ కోసం అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది.