Vallabhaneni Vamsi: తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ.. ఎప్పుడూ టీడీపీని తిట్టలేదు
Vallabhaneni Vamsi: నారా లోకేష్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత పార్టీ విధానాలను దెబ్బతిన్నాయ్
Vallabhaneni Vamsi: తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ.. ఎప్పుడూ టీడీపీ తిట్టలేదు
Vallabhaneni Vamsi: ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆయన మనసంతా వైసీపీలోనే ఉంది. కానీ తాజాగా మనసంతా టీడీపీయేనన్న వర్షన్ ను ఆవిష్కరించారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. మొత్తంగా వంశీ రూటే సెపరేట్ అన్న లాజిక్ మరోసారి తేలింది. తాజాగా తెలుగుదేశం పార్టీ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నట్టుగా ఉన్నాయ్.
టీడీపీ గొప్ప పార్టీ అన్నారు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. టీడీపీని ఎప్పుడు తిట్టలేదన్న వంశీ నారా లోకేష్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత పార్టీ విధానాలను దెబ్బతిన్నాయని విమర్శించానన్నారు. వైసీపీలో కొందరు వ్యక్తులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని కలసి పనిచేసేవాళ్లును కలుపుకు పోతానన్నారు. స్థాయి లేని వారు విమర్శలు చేస్తున్నారన్నారు పంచాయితీగాని వార్డు మెంబర్ గాని గెలవని వ్యక్తులు కూడా విమర్శలు చేయడం సరికాదన్నారు ఎమ్మెల్యే వంశీ.
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ను తీవ్రంగా విమర్శిస్తున్న వంశీ తాజాగా కొత్త రాగం ఆలపించడం వెనుక అసలేం జరిగిందని అటు వైసీపీ నేతలు, ఇటు టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఒకానొక సమయంలో వంశీ టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీ నుంచి ఎమ్మెల్యేగానూ కంటెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే వంశీకి అత్యంత సన్నిహితంగా ఉండే కొడాలి నానీని కేబినెట్ నుంచి తప్పించిన తర్వాత వ్యూహం మారిందా అన్న చర్చ కూడా రెండు పార్టీలో సాగుతోంది.