YCP: సూళ్లూరుపేట వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
YCP: విజయసాయిరెడ్డి ముందే పరస్పర ఆరోపణ, ప్రత్యారోపణలు
YCP: సూళ్లూరుపేట వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
YCP: ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ కోఆర్డినేటర్ సాయిరెడ్డి ఎదుట సూళ్లూరుపేట వైసీపీ వర్గాలు పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలతో రెచ్చిపోయారు. ఆ సమయంలో నెల్లూరు జిల్లాలో జరుగుతున్న వైసీపీ సాధికార బస్సు యాత్ర కోసం తిరుపతి నుంచి రాజుపాలెం వెళ్తున్నారు విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా రెండు వర్గాలు పరస్పరం విజయ్ సాయి రెడ్డి ముందే ఆరోపణలో ప్రతి ఆరోపణలు చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితిలు నెలకొన్నాయి.
గత 15 రోజుల క్రితం సులూరుపేట నియోజకవర్గంలో రెండు దఫాలుగా ఇలా ఎమ్మెల్యే అనుకూల వ్యతిరేక వర్గాలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం తీవ్రస్థాయిలో ఆరోపణలకు దిగుతోంది. ఘర్షణలకు సైతం దారితీసింది. దీంతో జిల్లా ఎన్డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి కలగజేసుకుని గొడవను సర్దుబాటు చేశారు. అప్పటినుంచి ఎవరు కప్పిన నిప్పులా ఉన్న వైసీపీలో వర్గ విభేదాలు తాజాగా మరోసారి రీజీనల్ ఇంఛార్జ్ విజయ్ సాయి రెడ్డి ముందు బట్టబయలయ్యాయి.