MLA Roja: చంద్రబాబు ఒక్క అమర రాజా కంపెనీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు
MLA Roja: ఏపీలో కాలుష్యం సృష్టిస్తున్న 54 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇస్తే చంద్రబాబు నాయుడు..
MLA Roja: చంద్రబాబు ఒక్క అమర రాజా కంపెనీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు
MLA Roja: ఏపీలో కాలుష్యం సృష్టిస్తున్న 54 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇస్తే చంద్రబాబు నాయుడు మాత్రం ఒక్క అమర రాజా కంపెనీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. నిబంధనలు పాటించని పరిశ్రమలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు ఇవ్వడాన్ని కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు.
హైకోర్టు ఆదేశాలకనుగుణంగా అమర రాజా కంపెనీ తన తప్పును సరిదిద్దుకోవాలని హెచ్చరించారు. గతంలో విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై చంద్రబాబు గగ్గోలు పెట్టారని.. ప్రాణాలతో ఆడుకుంటున్న అమర్‌రాజా ఫ్యాక్టరీపై ఎందుకు మాట్లాడటం లేదని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. పరిశ్రమలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చూస్తూ కూర్చోమని స్పష్టం చేశారు.