MLA Rapaka: సిగ్గు, శరం వదిలేసి ఉంటే రూ. 10 కోట్లు వచ్చేవి
MLA Rapaka: రూ. 10 కోట్లు ఇస్తామని కేఎస్‌ఎన్ రాజుతో టీడీపీ బేరసారాలు
MLA Rapaka: సిగ్గు, శరం వదిలేసి ఉంటే రూ. 10 కోట్లు వచ్చేవి
MLA Rapaka: వైసీపీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి 10 కోట్ల రూపాయలు ఇస్తామని తనతో బేరం ఆడారని రాపాక వరప్రసాద్ తెలిపారు. తన ఓటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమ్ముకుంటే 10 కోట్లు వచ్చి ఉండేవని ఆయన తెలిపారు. రాజోలులో జరిగిన ఒక సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తన మిత్రుడు KSN రాజుతో టీడీపీ నేతలు బేరసారాలు ఆడారని రాపాక వరప్రసాద్ తెలిపారు. అసెంబ్లీ దగ్గర కూడా ఒక రాజుగారు తనతో బేరాలకు దిగారన్నారు. టీడీపీకి ఓటేయాలని కోరారని, టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారని రాపాక అన్నారు. అయితే ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకుని తిరగలేమన్న రాపాక.. సిగ్గు, శరం వదిలేసి ఉంటే 10 కోట్లు వచ్చి ఉండేవన్నారు. తాను జగన్‌ను నమ్మాను కాబట్టే టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించానని రాపాక తెలిపారు.